కేరళలో మరోసారి నిఫా వైరస్ కలకలం

కేరళలో మరోసారి నిఫా వైరస్ కలకలం రేపుతుంది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు;

Update: 2024-07-21 03:21 GMT
కేరళలో మరోసారి నిఫా వైరస్ కలకలం
  • whatsapp icon

కేరళలో మరోసారి నిఫా వైరస్ కలకలం రేపుతుంది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. నిఫా వైరస్ వ్యాప్తి చెందకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం జిల్లా స్థాయి అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఇటీవల కాలంలో కనిపించని నిఫా వైరస్ మళ్లీ కనిపించడంతో అధికారులు అలెర్ట్ చేశారు.

బాలుడికి సోకిందని....
కేరళలోని మళప్పురం జిల్లాలో 14 ఏళ్ల బాలుడికి నిఫా వైరస్‌ సోకినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి వీణా జార్జ్‌ పేర్కొన్నారు. అయితే బాలుడికి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. నిఫా వైరస్ మరోసారి కలకలం రేపడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.


Tags:    

Similar News