ముంబైలో రెచ్చిపోయిన నైజీరియన్.. కత్తితో
ఈ ఘటనపై పోలీసులు అప్రమత్తమయ్యారు. పోలీసు బృందం ఆ వ్యక్తిని అడ్డుకుని నిరాయుధుడిని చేశారు.
ముంబైలో ఓ నైజీరియన్ రెచ్చిపోయాడు. కత్తితో విచక్షణారహితంగా దాడులకు పాల్పడ్డాడు. దక్షిణ ముంబైలోని చర్చ్‌గేట్ ఏరియా సమీపంలో బుధవారం 50 ఏళ్ల నైజీరియన్ జాతీయుడు చేసిన కత్తి దాడిలో 8 మంది గాయపడ్డారని పోలీసులు బుధవారం తెలిపారు. పార్సీ వెల్ సమీపంలోని టాటా గార్డెన్‌లో గత సాయంత్రం ఈ సంఘటన చోటు చేసుకుంది. జాన్ అనే నైజీరియన్ కత్తిని తీసి రోడ్డుపై వెళుతున్న వారిపై దాడి చేశారని ఒక అధికారి తెలిపారు.
ఈ ఘటనపై పోలీసులు అప్రమత్తమయ్యారు. పోలీసు బృందం ఆ వ్యక్తిని అడ్డుకుని నిరాయుధుడిని చేశారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకునే సమయానికి దాడిలో ఎనిమిది మంది వ్యక్తులు గాయపడ్డారని, చికిత్స కోసం వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారని ఆయన చెప్పారు. నిందితుడిని ఆజాద్ మైదాన్ పోలీస్ స్టేషన్‌కు తరలించామని, దీనికి సంబంధించి ఎఫ్‌ఐఆర్ నమోదు చేస్తామని అధికారి తెలిపారు.
దాడికి పాల్పడ్డ వ్యక్తి డ్రగ్స్ మత్తులో ఉన్నట్లు సమాచారం. గత నెలలో 31 ఏళ్ల నైజీరియన్ వ్యక్తిని 20 గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకున్నందుకు అరెస్టు చేశారు. అంతర్జాతీయ మార్కెట్‌లో ఈ డ్రగ్స్ విలువ రూ.6 లక్షలు. నిందితుడు విక్రోలిలో నివాసముంటున్న బట్టల షాపు యజమాని. గత నెల ప్రారంభంలో, ముంబైలో జరిగిన హత్య కేసులో ఆరుగురు నైజీరియన్ల బృందం మేఘాలయలో పట్టుబడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితులు కమర్షియల్ టూరిస్ట్ కారులో బంగ్లాదేశ్‌కు పారిపోడానికి ప్రయత్నించారు. పలు డ్రగ్స్ దందాలలోనూ, కేసుల లోనూ నైజీరియన్స్ నిందితులుగా ఉంటున్నారు. ఎయిర్ పోర్టుల్లో డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తూ ఇప్పటికే పలువురు నైజీరియన్స్ పట్టుబడ్డారు. మెట్రో నగరాల్లో నైజీరియన్స్ చేసే అక్రమ దందాల గురించి తెలిసినా ఎవరూ పట్టించుకోవడం లేదనే విమర్శలు కూడా వస్తూ ఉన్నాయి.