నేటి నుంచి ఉప రాష్ట్రపతి ఎన్నికకు నామినేషన్లు
నేటి నుంచి ఉప రాష్ట్రపతి ఎన్నికకు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ నెల 19వ తేదీ వరకూ నామినేషన్లను స్వీకరిస్తారు
నేటి నుంచి ఉప రాష్ట్రపతి ఎన్నికకు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ నెల 19వ తేదీ వరకూ నామినేషన్లను స్వీకరిస్తారు. వాటిని 20వ తేదీన పరిశీలిస్తారు. ఈ నెల 22వ తేదీ నామినేషన్ల ఉపసంహరణకు తుదిగడువుగా ఎన్నికల కమిషన్ పేర్కొంది. ఎన్నిక జరిగితే పోలింగ్ ను ఆగస్టు 6వ తేదీన నిర్వహిస్తారు. ఈ ఎన్నికల్లో ఓటు వేసేందుకు రాజ్యసభ, లోక్‌సభ, నామినేటెడ్ సభ్యులు అర్హులు.
వచ్చే నెల 10వ తేదీతో..
ప్రస్తుత ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు పదవీకాలం వచ్చే నెల 10వ తేదీతో ముగియనుంది. అందుకే కొత్త ఉప రాష్ట్రపతిని ఎన్నుకునేందుకు నేడు నోటిఫికేషన్ జారీ చేయనుంది. నామినేషన్లను ఈరోజు నుంచి అధికారులు స్వీకరిస్తారు. తదుపరి ఉప రాష్ట్రపతి ఎవరన్నది రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.