భారీ వరదలతో ఉత్తర భారతం విలవిల

భారీ వర్షాలతో ఉత్తర భారతదేశం అల్లాడి పోతుంది. అనేక మంది భారీ వర్షాల కారణంగా ప్రాణాలు కోల్పోతున్నారు.

Update: 2022-08-20 06:32 GMT

భారీ వర్షాలతో ఉత్తర భారతదేశం అల్లాడి పోతుంది. అనేక మంది భారీ వర్షాల కారణంగా ప్రాణాలు కోల్పోతున్నారు. హిమాచల్ ప్రదేశ్ లోనే కొండచరియలు విరిగిపడి పది మంది మరణించారు. రాష్ట్రంలోని మండీ జిల్లాలోని జాదోస్ గ్రామంలో ఒక ఇంటిపై కొండిచరియలు విరిగిపడటంతో ఆ ఇంట్లో ఉన్న ఏడుగురు మరణించారు. అదే రాష్ట్రంలో మరో ముగ్గురు వరదలకు మృతి చెందారు. నిద్రలో ఉన్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఘాట్ రోడ్డులన్నింటినీ వెంటనే మూసివేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇక ఉత్తరాఖండ్ లోనూ భారీ వర్షాలు వణుకుపుట్టిస్తున్నాయి.

ప్రాణ, ఆస్తినష్టం....
ఇక జమ్మూ కాశ్మీర్ లో భారీ వర్షాల కారణంగా వైష్ణోదేవి ఆలయంలో భక్తులు ఇబ్బంది పడుతున్నారు. ఎవరినీ ఆలయంలోకి అనుమంతించడం లేదు. రవాణా వ్యవస్థ పూర్తిగా స్థంభించి పోయింది. ఇక ఉత్తరాఖండ్ లోనూ భారీ వర్షాల కారణంగా అనేక గ్రామాలు వరద నీటిలో మునిగిపోయాయి. రాయపూర్ బ్లాక్ లోని సర్ఖేత్ గ్రామం వరద నీటిలో మునిగి పోవడంతో గ్రామస్థులను ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది రక్షించారు. పెద్దయెత్తున ఆస్తి, నష్టం ప్రాణ నష్టం జరుగుగుతుంది. అధికారులు అప్రమత్తమై అన్ని ప్రాంతాల్లో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.


Tags:    

Similar News