భారత్ లో యాక్టివ్ కేసులు ఎన్నంటే?

భారత్ లో కరోనా వైరస్ కేసుల సంఖ్య గత కొన్నిరోజులుగా తగ్గుతుంది. వైరస్ అదుపులోకి వస్తుంది

Update: 2022-10-02 04:45 GMT

భారత్ లో కరోనా వైరస్ కేసుల సంఖ్య గత కొన్నిరోజులుగా తగ్గుతుంది. వైరస్ అదుపులోకి వస్తుంది. నాలుగు వేల కంటే తక్కువ సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. ఒక్కరోజులోనే 3,364 కరోనా కేసులు నమోదయ్యాయి. 2.64 లక్షల పరీక్షలు నిర్వహించగా వీరికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. మరణాల సంఖ్య కూడా అదుపులోకి వచ్చింది. కరోనా కేసుల సంఖ్య తగ్గుతుండటం ఊరటనిచ్చే అంశంగా పేర్కొన్నాలి.

తగ్గుతున్న రేటు...
భారత్ లో ఇప్పటి వరకూ 4.45 కోట్ల మంది కరోనా వైరస్ బారిన పడ్డారు. వీరిలో 4.44 కోట్ల మంది రికవరీ అయినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. రికవరీ రేటు 98.73 శాతంగా నమోదయింది. ఇప్పటి వరకూ భారత్ లో 5,28,673 మంది కరోనా కారణంగా మరణించారు. ప్రస్తుతం భారత్ లో 37,444 యాక్టివ్ కేసులున్నాయని అధికారులు వెల్లడించారు. యాక్టివ్ కేసుల శాతం 0.08 శాతానికి పడిపోయింది. ఇప్పటి వరకూ దేశ వ్యాప్తంగా 218.75 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేసినట్లు అధికారులు తెలిపారు.


Tags:    

Similar News