రావత్ హెలికాప్టర్ ప్రమాదానికి కారణాలివే?
సీడీఎస్ బిపిన్ రావత్ హెలికాప్టర్ ప్రమాదంపై అధికారులు నివేదిక అందించారు
సీడీఎస్ బిపిన్ రావత్ హెలికాప్టర్ ప్రమాదంపై అధికారులు నివేదిక అందించారు. ప్రమాదం కేసు దర్యాప్తు నివేదికను రక్షణ శాఖ మంత్రి రాజ్ నాధ్ సింగ్ కు అందజేశారు. గత డిసెంబరు 8న తమిళనాడులోని ఊటీ సమీపంలో బిపిన్ రావత్ బృందం ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కూలిపోయిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో బిపిన్ రావత్ తో పాటు ఆమె సతీమణి మధులిక మరో 12 మంది మరణించారు.
నివేదిక సమర్పించిన....
హెలికాప్టర్ ప్రమాదంపై ప్రభుత్వం అత్యున్నత స్థాయి విచారణకు ఆదేశించింది. ఎయిర్ మార్షల్ మన్వేంద్ర సింగ్ నేతృత్వంలో ప్రమాదానికి గల కారణాలపై విచారణ చేపట్టింది. దట్టమైన పొగమంచు కారణంగా పైలట్ కు దారి కన్పించలేదని నివేదికలో పేర్కొన్నారు. కోయంబత్తూరు నుంచి వెల్లింగ్టన్ కు బయలుదేరిన హెలికాప్టర్ దట్టమైన పొగమంచులో కూరుకుపోయిందని, ప్రమాదమే ఘటనకు కారణమని నివేదికలో వెల్లడించారు.