యాక్టివ్ కేసులు బాగా తగ్గాయ్

దేశంలో 98.75 శాతం రికవరీ రేటు ఉందని అధికారులు తెలిపారు. భారత్ లో ఇప్పటి వరకూ 4.45 కోట్ల మందికి కరోనా వైరస్ సోకింది.

Update: 2022-10-08 05:15 GMT

భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి అదుపులోకి వస్తుంది. మూడు వేల కేసులకు తక్కువగానే నమోదు అవుతుండటం కొంత సంతోషించదగ్గ విషయమని వైద్య నిపుణులు సయితం అంగీకరిస్తున్నారు. ఒక్కరోజులో 2,66,839 మందికి వైద్య పరీక్షలు నిర్వహించగా 2,797 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. ఒక్కరోజులోనే 3,884 మంది కరోనా నుంచి కోలుకున్నారు.

రికవరీ రేటు....
దేశంలో ప్రస్తుతం 98.75 శాతం రికవరీ రేటు ఉందని అధికారులు తెలిపారు. భారత్ లో ఇప్పటి వరకూ 4.45 కోట్ల మందికి కరోనా వైరస్ సోకింది. వీరిలో 4.40 కోట్ల మంది కరోనా నుంచి బయటపడినట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. ఇప్పటి వరకూ భారత్ లో 5,28,778 మంది కరోనా కారణంగా మరణించారు. ప్రస్తుతం దేశంలో 29,251 యాక్టివ్ కేసులున్నాయి. యాక్టివ్ కేసుల శాతం 0.07 శాతంగా నమోదయింది.


Tags:    

Similar News