ఈరోజు భారత్ లో కరోనా కేసులు ఎన్నంటే?
ప్రజలు కోవిడ్ నిబంధనలను సక్రమంగా పాటించకపోవడం వల్లనే భారత్ లో కరోనా కేసులు రోజూ నమోదవుతున్నాయని అధికారులు చెబుతున్నారు
భారత్ లో కరోనా కేసులు కొనసాగుతున్నాయి. ఒకరోజు తగ్గుతూ, మరొక రోజు పెరుగుతూ వస్తున్నాయి. ప్రజలు కోవిడ్ నిబంధనలను సక్రమంగా పాటించకపోవడం వల్లనే భారత్ లో కరోనా కేసులు రోజూ నమోదవుతున్నాయని అధికారులు చెబుతున్నారు. ఒక్కరోజులో 5,664 మంది కరోనా వైరస్ బారిన పడ్డారు. కరోనా కారణంగా 35 మంది మరణించారు. ఒక్కరోజులో కరోనా నుంచి 4,555 మంది కరోనా నుంచి కోలుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు.
రికవరీ రేటు....
కరోనా రికవరీ రేటు 98.71 శాతంగా నమోదయింది. యాక్టివ్ కేసుల శాతం మళ్లీ పెరిగింది. ఈరోజు 0.11 శాతంగా నమోదయింది. ఇప్పటి వరకూ దేశంలో 4,45,34,188 మంది కరోనా వైరస్ బారిన పడ్డారు. ఇప్పటి వరకూ దేశంలో 4,39,57,929 కరోనా నుంచి కోలుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. కరోనా కారణంగా ఇప్పటి వరకూ దేశంలో 5,28,337 మంది మరణించారు. ప్రస్తుతం భారత్ లో 47,922 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా వ్యాక్సిన్ డోసుల సంఖ్య ఇప్పటి వరకూ 216.56 కోట్లకు చేరింది.