మళ్లీ పెట్రో బాదుడు.. ఈరోజు ఎంతంటే?

చమురు సంస్థలు వినియోగదారులపై ఏ మాత్రం దయ చూపడం లేదు. ప్రతి రోజూ పెట్రోలు ధరలు పెంచుతూనే ఉన్నాయి

Update: 2022-03-25 02:48 GMT

చమురు సంస్థలు వినియోగదారులపై ఏ మాత్రం దయ చూపడం లేదు. ప్రతి రోజూ పెట్రోలు ధరలు పెంచుతూనే ఉన్నాయి. గతంలో పదిహేను పైసలు, ఇరవై పైసల వరకూ పెంచిన చమురు సంస్థలు ఏకంగా 80 పైసలకు పైగానే పెంచుతూ వెళుతున్నాయి. గత ఐదు నెలలుగా ఐదు రాష్ట్రాల ఎన్నికల కారణంగా ధరలు పెంచలేదు. దీంతో ఐదునెలల భారాన్ని వినియోగదారుడిపై త్వరగా మోపేందుకు చమురు సంస్థలు సిద్ధమవుతున్నట్లే కన్పిస్తుంది.

హైదరాబాద్ లో....
తాజాగా ఈరోజు పెట్రోలు, డీజిల్ పై ఎనభై పైసలు లీటరుకు పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. హైదరాబాద్ లో లీటరు పెట్రోలు ధర 90 పైసులు పెరిగింది. దీంతో పెట్రోలు ధర 110.91 రూపాయలకు చేరుకుంది. డీజిల్ లీటరకు 87 పైసలు పెరగడంతో దాని ధర 97.23 రూపాయలకు చేరుకుంది. దీంతో వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికలు ఉంటే ధరలు పెంచరని, ఎన్నికలు ముగియగానే ప్రజలపై భారం మోపుతున్నారని అంటున్నారు. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పెరగడం కూడా చమురు సంస్థలు పెట్రో ఉత్పత్తుల ధరలను పెంచడానికి కారణమని చెప్పక తప్పదు.


Tags:    

Similar News