ఐదోరోజూ వీర బాదుడే

చమురు సంస్థలు పెట్రోల్ ధరల పెంపుదలను ఆపడం లేదు. వరసగా ఐదోరోజు కూడా పెట్రోలు, డీజిల్ ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి.

Update: 2022-03-27 02:49 GMT

చమురు సంస్థలు పెట్రోల్ ధరల పెంపుదలను ఆపడం లేదు. వరసగా ఐదోరోజు కూడా పెట్రోలు, డీజిల్ ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. తాజాగా లీటరు పెట్రోలుపై పై 57 పైసలు, లీటరు డీజిల్ పై 60 పైసలు పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయిం తీసుకున్నాయి. గత ఐదు రోజులుగా పెట్రోలుపై దాదాపు నాలుగు రూపాయలకు పైగానే ధరలు పెంచి వాహనదారులపై చమురు సంస్థలు కసి తీర్చుకున్నాయి.

పెరిగిన ధరలు...
పెరిగిన ధరల ప్రకారం హైదరాబాద్ లో లీటరు పెట్రోలు ధర 112.37 రూపాయలకు చేరుకుంది. అలాగే లీటరు డీజిల్ ధర 98.70 రూపాయలకు చేరుకుంది. వరసగా ధరలు పెంచుతూ పోతుండటంతో వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీని ప్రభావం నిత్యావసర వస్తువుల ధరలపై కూడా ఉండనుంది. రాజకీయ పార్టీలు ధరల పెంపుదలకు వ్యతిరేకంగా ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నారు.


Tags:    

Similar News