ఇక రోజు వారీ బాదుడు మొదలు

కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే చమురు సంస్థలు భారీగా భారత్ లో పెట్రోలు, డీజిల్ ధరలను పెంచనున్నాయి

Update: 2022-03-12 02:36 GMT

భారత్ లో పెట్రోలు, డీజిల్ ధరలు నేడో, రేపో పెరగనున్నాయి. కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే చమురు సంస్థలు భారీగా ధరలను పెంచనున్నాయని చెబుతున్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగిశాయి. ఫలితాలు కూడా వచ్చేశాయి. నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ విజయం సాధించింది. దీంతో మరోసారి రోజు వారీ పెట్రోలు ధరలు పెరుగుతాయని నిపుణులు చెబుతున్నారు. శ్రీలంకలో మాదిరి ఒకేసారి యాభై రూపాయలు కాకుండా రోజువారీ బాదుడు ఉండబోతుందంటున్నారు.

పెట్రోలు పై రూ.15లు...
ఇప్పటికే ఉక్రెయిన్ - రష్యా యుద్ధంతో క్రూడాయిల్ ధర బ్యారెల్ భారీగా పెరిగింది. ముడిచమురు ధరలు బాగా పెరగడంతో పెట్రోలు, డీజిల్ ధరలు పెంచక తప్పదు. పెట్రోలుకు లీటరకు 15 రూపాయలు, డీజిల్ కు 12 రూపాయలు పెరగవచ్చన్న అంచనాలు ఉన్నాయి. అయితే ఒక్కసారి మాత్రం కాకుండా ప్రతి రోజూ పెంచుకుంటూ పోతారు. ఇప్పటికే పెట్రోల్ ధర వందరూపాయలుకు పైగానే భారత్ లో ఉంది.


Tags:    

Similar News