పెరిగిన సిలిండర్ ధర

చమురు కంపెనీలు వినియోగదారులకు నూతన సంవత్సరం తొలిరోజే షాక్ ఇచ్చాయి. వంట గ్యాస్ సిలిండర్ ధరను పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి

Update: 2023-01-01 06:15 GMT

చమురు కంపెనీలు వినియోగదారులకు నూతన సంవత్సరం తొలిరోజే షాక్ ఇచ్చాయి. వంట గ్యాస్ సిలిండర్ ధరను పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. ఒక్కొక్క గ్యాస్ సిలిండర్ పై ఇరవై ఐదు రూపాయలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. ప్రతి నెల మొదటి వారం గ్యాస్, పెట్రోలు ధరలను ఆయిల్ కంపెనీలు సమీక్షిస్తాయి. అందులో భాగంగా జనవరి ఒకటో తేదీన సమీక్షించిన తర్వాత ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి.

నేటి నుంచే అమలు...
పెరిగిన ధరలు నేటి నుంచే అమలులోకి రానున్నాయి. అయితే పెరిగిన ధరలు కేవలం వాణిజ్య సిలిండర్లకు మాత్రమే వర్తించనున్నాయి. గృహ వినియోగదారులకు పెరిగిన ధరలు వర్తించవు. గృహ వినియోగదారులకు పంపిణీ చేసే సిలిండర్ల ధరల్లో మాత్రం ఎలాంటి మార్పు లేదు. కేవలం కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలను మాత్రమే పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి.


Tags:    

Similar News