భారీగా పెరిగిన పెట్రోలు ధరలు
చమురు సంస్థలు మరోసారి పెట్రోలు ధరలను పెంచాయి. రెండో రోజు కూడా ధరలను పెంచి వినియోగదారులపై భారం మోపాయి
చమురు సంస్థలు మరోసారి పెట్రోలు ధరలను పెంచాయి. రెండో రోజు కూడా ధరలను పెంచి వినియోగదారులపై భారం మోపాయి. ఐదు నెలలుగా ఐదు రాష్ట్రాల ఎన్నికలతో పెట్రోలు ధరలను పెంచలేదు. ఇప్పుడు ఆ కసి అంతా చమురు సంస్థలు తీర్చుకుంటున్నట్లు కనపడుతుంది. నిన్న, ఈరోజు పెట్రోలు, డీజిల్ పై అధికంగా పెంచడంతో వినియోగదారుల్లో ఆందోళన వ్యక్తమవుతుంది.
గతంలో లేని విధంగా....
నేడు పెట్రోలు లీటరు పై 90 పైసలు, డీజిల్ పై 87 పైసలు పెంచాయి. ఈ పెరుగుదలతో హైదరాబాద్ లో లీటరు పెట్రోలు ధర 110 రూపాయలకు చేరుకుంది. డీజిల్ ధర 96.36కు చేరుకుంది. విజయవాడలో అయితే లీటర్ పెట్రోలు 112.08 రూపాయలకు చేరుకుంది. గతంలో ఐదు నుంచి ఆరు పైసలు వరకూ పెంచే చమురు సంస్థలు గత రెండు రోజులుగా భారీ మొత్తంలో ధరలను పెంచడంపై ఆందోళన వ్యక్తమవువుతంది. రష్యా - ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ముడిచమురు ధరలు పెరిగినందునే పెట్రోలు, డీజిల్, వంటగ్యాస్ ధరలను పెంచాల్సి వచ్చిందని చమురు సంస్థలు వివరణ ఇచ్చుకుంటున్నాయి.