భారత్ లో మరో రెండు ఒమిక్రాన్ కేసులు
భారత్ ను ఒమిక్రాన్ వేరియంట్ భయపెడుతోంది. రోజురోజుకూ కేసులు పెరుగుతున్నాయి
భారత్ ను ఒమిక్రాన్ వేరియంట్ భయపెడుతోంది. రోజురోజుకూ కేసులు పెరుగుతున్నాయి. తాజాగా మహారాష్ట్రలో రెండు కొత్త ఒమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదయ్యయి. దీంతో మహారాష్ట్రలో ఈ కేసుల సంఖ్య పదికి పెరిగింది. ఇటీవల దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన ఒక వ్యక్తికి, అమెరికా నుంచి వచ్చిన మరో వ్యక్తికి ఒమిక్రాన్ వేరియంట్ పాజిటివ్ వచ్చినట్లు తేలింది. దీంతో భారత్ లో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 23కు పెరిగింది.
ఐదు రాష్ట్రాల్లో....
ఇప్పటికే దేశంలో ఐదు రాష్ట్రాల్లో ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. కర్ణాటక, మహారాష్ట్ర, రాజస్థాన్, ఢిల్లీ, గుజరాత్ లలో ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇతర రాష్ట్రాలు కూడా అప్రమత్తమయ్యాయి. నమోదయిన కేసులన్నీ దాదాపు దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన వారే కావడం విశేషం. కేంద్ర ప్రభుత్వం కూడా అప్రమత్తమయింది. కోవిడ్ నిబంధలను ఖచ్చితంగా పాటించాలంటూ అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది.