భారత్ ను బెంబేలెత్తిస్తున్న ఒమిక్రాన్

భారత్ లో ఒమిక్రాన్ వేరియంట్ వణుకుపుట్టిస్తుంది. రోజూ కేసుల సంఖ్య పెరుగుతుంది. దీంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమయింది.

Update: 2021-12-23 03:41 GMT

భారత్ లో ఒమిక్రాన్ వేరియంట్ వణుకుపుట్టిస్తుంది. ప్రతిరోజూ కేసుల సంఖ్య పెరుగుతుంది. దీంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమయింది. ఇప్పటికే దేశంలో పదిహేడు రాష్ట్రాల్లో ఒమిక్రాన్ వేరియంట్ వ్యాపించింది. తాజాగా భారత్ లో ఒమిక్రాన్ వేరియంట్ కేసులు 39 నమోదు కావడం ఆందోళన కల్గిస్తుంది. భారత్ వ్యాప్తంగా ఇప్పటి వరకూ ఒమిక్రాన్ వేరియంట్ కేసులు 263 నమోదయ్యాయి.

ఒక్కరోజులోనే....
తాజాగా తెలంగాణలో 14, గుజరాత్ లో 9, కేరళలో 9, హర్యానా, ఉత్తరాఖండ్, ఆంధ్రప్రదేశ్ లో ఒకటి చొప్పున, రాజస్థాన్ లో నాలుగు కేసులు నమోదయ్యాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం కొత్తగా కోవిడ్ మార్గదర్శకాలను విడుదల చేసే అవకాశం కన్పిస్తుంది. ఒమిక్రాన్ వేరియంట్ తో పాటు కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై నేడు ప్రధాని మోదీ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. ఇప్పటికే ఢిల్లీలో క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకలపై ఆంక్షలను విధించారు.


Tags:    

Similar News