48 దేశాల్లో డేంజర్ బెల్స్ ... విస్తరించిన ఒమిక్రాన్

ఒమిక్రాన్ వేరియంట్ ప్రపంచాన్ని వణికిస్తుంది. సౌతాఫ్రికాలో మొదలయిన వేరయంట్ చాలా వేగంగా ఇతర దేశాలకు వ్యాప్తి చెందుతుంది

Update: 2021-12-06 03:49 GMT

ఒమిక్రాన్ వేరియంట్ ప్రపంచాన్ని వణికిస్తుంది. సౌతాఫ్రికాలో మొదలయిన వేరయంట్ చాలా వేగంగా ఇతర దేశాలకు వ్యాప్తి చెందుతుంది. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకూ 941 ఒమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదయ్యాయి. మొత్తం 46 దేశాలకు ఈ వేరియంట్ విస్తరించింది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఒమిక్రాన్ వేరియంట్ డేంజర్ బెల్స్ మోగిస్తుందనే చెప్పాలి.

అత్యంత వేగంగా...
డెల్టా వేరియంట్ కంటే అత్యంత వేగంగా వ్యాప్తి చెందే ఈ వేరియంట్ సౌతాఫ్రికా నుంచి మొదలయింది. సౌతాఫ్రికాలో ప్రస్తుతం 228 ఒమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత అత్యధికంగా జింబాబ్వేలో యాభై కేసులు నమోదయ్యాయి. భారత్ లో కూడా ఈ సంఖ్య 21కి చేరుకోవడం ఆందోళన కల్గిస్తుంది


Tags:    

Similar News