భారత్ లో ఒమిక్రాన్ టెన్షన్.. మరో ఇద్దరికీ?
భారత్ లో ఒమిక్రాన్ టెన్షన్ వదలడం లేదు. తాజాగా చండీఘడ్, బెంగళూరు ఎయిర్ పోర్టులో ఈ కలకలం రేగింది.
భారత్ లో ఒమిక్రాన్ టెన్షన్ వదలడం లేదు. తాజాగా చండీఘడ్, బెంగళూరు ఎయిర్ పోర్టులో ఈ కలకలం రేగింది. సౌతాఫ్రికా నుంచి వచ్చి ఇద్దరు ప్రయాణికులకు కరోనా సోకిందని తెలయడంతో ఎయిర్ పోర్టు అధికారులు అప్రమత్తమయ్యారు. వారిని క్వారంటైన్ కు తరలించారు. ఇద్దరి రక్తనమూనాలను సేకరించి పరీక్షల కోసం ల్యాబ్ కు పంపారు.
ఆంక్షలు ....
సౌతాఫ్రికా నుంచి వీరిద్దరూ రావడంతో వారికి ఒమిక్రాన్ వేరియంట్ సోకిందన్న ఆందోళన వ్యక్తమవుతుంది. దేశంలోని ప్రతి ఎయిర్ పోర్టులో ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధించింది. ఇతర దేశాల నుంచి వచ్చిన వారు ఖచ్చితంగా పరీక్షలు చేయించుకోవాలన్న నిబంధనను విధించింది.