కాలిపోతున్న అడవి పక్కన టిక్ టాక్ స్టార్ ఓవరాక్షన్.. నెటిజన్స్ తిట్లే తిట్లు

సోషల్ మీడియాలో పాపులారిటీ కోసం ఎవరు.. ఏమి చేస్తుంటారో వారికే అర్థం అవ్వదు. కొన్ని కొన్ని సార్లు క్రియేటివిటీ కోసం పోయి చీవాట్లు తినాల్సి వస్తూ ఉంటుంది. ప్రస్తుతం పాకిస్థాన్ టిక్ టాక్ స్టార్ అదే విధంగా తిట్లను ఎదుర్కొంటూ ఉంది. కాలిపోతున్న అడవి పక్కన ఆమె ఫోటో షూట్ చేయడం.

Update: 2022-05-18 09:09 GMT


సోషల్ మీడియాలో పాపులారిటీ కోసం ఎవరు.. ఏమి చేస్తుంటారో వారికే అర్థం అవ్వదు. కొన్ని కొన్ని సార్లు క్రియేటివిటీ కోసం పోయి చీవాట్లు తినాల్సి వస్తూ ఉంటుంది. ప్రస్తుతం పాకిస్థాన్ టిక్ టాక్ స్టార్ అదే విధంగా తిట్లను ఎదుర్కొంటూ ఉంది. కాలిపోతున్న అడవి పక్కన ఆమె ఫోటో షూట్ చేయడం.. ఆ ఫోటోలు వైరల్ అవ్వడంతో ఆమెకు పాపులారిటీ రావడం సరికదా.. కామన్ సెన్స్ ఉందా అంటూ ఇష్టమొచ్చినట్లు తిడుతూ ఉన్నారు.

లక్షల్లో ఫాలోవర్స్ ఉన్న ప్రముఖ పాకిస్థానీ సోషల్ మీడియా సెలెబ్రిటీ.. అడవిలో మంటలు చెలరేగుతున్నా టిక్‌టాక్ వీడియోకు ఫోజులిచ్చి తీవ్ర విమర్శలను ఎదుర్కొంటోంది. ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారిన 15 సెకన్ల వీడియోలో, టిక్‌టాక్ స్టార్ 'హుమైరా అస్గర్' మంటల్లో ఉన్న కొండ ముందు గౌనులో సరదాగా నడుస్తూ కనిపించింది. చిన్న అగ్గిరవ్వ చాలు.. అడవులు తగలబడడానికి అలా మంటలు అంటుకున్నా.. కనీసం ఆర్పడానికి ప్రయత్నించలేదు కదా.. అధికారులకు కూడా సమాచారం ఇవ్వలేదు హుమైరా.. ఆమె టీమ్. దీంతో ఆమెపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. తాము మంటలను ఆర్పలేదని, వీడియోలు చేయడం వల్ల ఎలాంటి హాని జరగలేదని ఆమె సహాయకురాలు చెబుతోంది.

పర్యావరణాన్ని కనీసం పట్టించుకోని ఇలాంటి సోషల్ మీడియా స్టార్స్ ను ఫాలో అవ్వడం మనకు అవసరమా అని పలువురు నెటిజన్లు హుమైరాపై విరుచుకుపడ్డారు. ఇలా మంటలు అంటుకోవడం వలన ఎన్నో సమస్యలు ఉత్పన్నమవుతాయని.. జంతుజాలం నశిస్తుందని ఆమెకు పలువురు బుద్ధి చెప్పారు. పర్యావరణ నిబంధనలను ఉల్లంఘించడంపై ఆమెను, ఆమె టీమ్ పై చర్యలు తీసుకోవాలనే డిమాండ్స్ వినిపిస్తూ ఉన్నాయి. అజ్ఞానం, పిచ్చి తప్ప మరొకటి కావని అంటున్నారు. ఇలాంటి వాళ్ల సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల ను బ్లాక్ చేయాలని పలువురు డిమాండ్ చేశారు. నేరస్థులను శిక్షించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. ఏది ఏమైనా.. ఆమె అనుకున్న ఉద్దేశ్యం వేరైగా ఉన్నా భారీగా తిట్లు మాత్రం హుమైరా అస్గర్ కు పడ్డాయి.


Tags:    

Similar News