రేపటి నుంచి పార్లమెంటు సమావేశాలు

పార్లమెంటు సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి.

Update: 2024-07-21 01:49 GMT

పార్లమెంటు సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. సోమవారం ప్రారంభం కానున్న ఈ సమావేశాలు ఆగస్టు 12వ తేదీ వరకూ కొనసాగనున్నాయి. అయితే మంగళవారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో బడ్జెట్ ను ప్రవేశ పెట్టనునున్నారు. 2024 -25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మిగిలిన ఎనిమిది నెలల కాలానికి నిర్మలమ్మ బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు.

అధికార, విపక్షాలు...
ఈ బడ్జెట్ సమావేశాల్లో అనేక కీలక బిల్లులను ప్రభుత్వం ఆమోదించుకునే అవకాశముంది. అయితే ప్రతిపక్షాలు కూడా అధికార పక్షంపై వ్యూహాత్మక దాడికి సిద్ధమయ్యాయి. నీట్ ప్రశ్నాపత్రాల లీకేజీ, రైల్వే యాక్సిడెంట్లపై ప్రభుత్వాన్ని నిలదీయాలని విపక్షాలు గట్టిగా భావిస్తున్నాయి. దీంతో పాటు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో సర్కార్ వాటాను యాభై ఒకటి శాతం కంటే తగ్గించే ప్రయత్నాన్ని కూడా అడ్డుకుంటామని ఇప్పటికే విపక్షాలు ప్రకటించడతో ఈ సమావేశాలు హాట్ హాట్ గా సాగే అవకాశముంది.


Tags:    

Similar News