పెట్రోలు ధర అంత పెరగనుందా?

పెట్రోలు ధరలు ఇక మండిపోనున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరిగే అవకాశముందని అంచనాలు వినపడుతున్నాయి

Update: 2022-03-08 01:25 GMT

పెట్రోలు ధరలు ఇక మండిపోనున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరిగే అవకాశముందని అంచనాలు వినపడుతున్నాయి. ఇప్పటికే రష్యా - ఉక్రెయిన్ యుద్ధంతో క్రూడాయిల్ ధర అంతర్జాతీయ మార్కెట్ లో భారీగా పెరిగింది. దీంతో పెట్రోలు ఉత్పత్తుల ధరలు పెరిగే అవకాశం ఉందని తెలిసింది. క్రూడాయిల్ బ్యారెల్ ధర 125 డాలర్లకు పెరగడంతో పెంపు అనివార్యమని చెబుతున్నారు.అయితే పెంపు ఎంత ఉంటుందన్నది ఉత్కంఠగా మారింది.

రెండు, మూడు రోజుల్లోనే....
ఇక ఉత్తర్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవా, పంజాబ్ ఎన్నికలు కూడా ముగిసినందున పెట్రోలు ధరలను పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని చెబుతున్నారు. పెట్రోలు 15 రూపాయలు, డీజిల్ లీటరకు 22 రూపాయలు పెరిగే అవకాశముందని చెబుతున్నారు. అదే జరిగితే వినియోగదారులపై భారీ మోత పడే అవకాశముంది. దీంతో నిత్యావసర వస్తువుల ధరలు కూడా నింగినంటనున్నాయి.


Tags:    

Similar News