మళ్లీ పెరిగిన పెట్రోలు ధరలు... లీటరు పెట్రోలు రూ.120

పెట్రోలు ధరలు మళ్ల ీపెరిగాయి. ఈరోజు కూడా చమురు సంస్థలు పెట్రోలు, డీజిల్ ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి.

Update: 2022-04-05 03:37 GMT

పెట్రోలు ధరలు మళ్ల ీపెరిగాయి. ఈరోజు కూడా చమురు సంస్థలు పెట్రోలు, డీజిల్ ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. పెట్రోలు లీటరుపై 91 పైసలు, డీజిల్ లీటరు పై 87 పైసలు ధరలను పెంచాయి. దీంతో ఆంధ్రప్రదేశ్ లో పెట్రోలు లీటరు ధర రూ.120 లు దాటేసింది. వరసగా 13వ రోజు పెట్రో ఉత్పత్తుల ధరలను పెంచడంతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. వాహనదారులు తమ వాహనాన్ని బయటకు తీయాలంటే భయపడిపోతున్నారు.

13వ సారి....
పెరిగిన ధరల ప్రకారం హైదరాబాద్ లో లీటరు పెట్రోలు ధర 118.59 రూపాయలు , డీజిల్ ధర లీటరు రూ.104.62లు గా ఉంది. విజయవాడలో లీటరు పెట్రోలు ధర 120.18 రూపాయలు, లీటరు డీజిల్ ధర 105.84 రూపాయలకు చేరుకుంది. 13 రోజుల్లో లీటరు పెట్రోలు పై 11 రూపాయల వరకూ చమురు సంస్థలు పెంచాయి. అంతర్జాతీయ మార్కెట్ లో బ్యారెల్ క్రూడాయిల్ ధర 107. 52 డాలర్లకు చేరుకోవడంతో ధరలు పెంచక తప్పడం లేదని చమురు సంస్థలు సమర్థించుకుంటున్నాయి.


Tags:    

Similar News