వరసగా ఎనిమిదోరోజు పెట్రో బాదుడు
పెట్రోలు ధరలు ఈరోజు కూడా పెరిగాయి. వరసగా ఎనిమిదో సారి పెట్రోలు ధరలను చమురు సంస్థలు పెంచేశాయి
పెట్రోలు ధరలు ఈరోజు కూడా పెరిగాయి. వరసగా ఎనిమిదో సారి పెట్రోలు ధరలను చమురు సంస్థలు పెంచేశాయి. తొమ్మిది రోజుల్లో ఎనిమిది సార్లు పెట్రోలు, డీజిల్ ధరలను పెంచాయి. ఇప్పటి వరకూ ఎనిమిది సార్లు ధరలను పెంచడంతో పెట్రోలు లీటరుపై 6.40 రూపాయలు వినియోగదారులపై భారం పడింది. పెట్రోలు లీటరకు 90 పైసలు, డీజిల్ లీటరకు 80 పైసలు చొప్పున పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి.
ఆ ప్రభావంతో.....
దీంతో హైదరాబాద్ లో లీటరు పెట్రోలు ధర 115.42 రూపాయలకు చేరుకుంది. అలాగే లీటరు డీజిల్ ధర 101.58 రూపాయలకు చేరుకుంది. దీని ప్రభావం నిత్యావసరాలపై కూడా పడుతుంది. కూరగాయల ధరలు మండి పోతున్నాయి. ఈ కాలంలో కొంత తక్కువ ధర పలకాల్సిన కూరగాయలు పెట్రోలు ధరల పెంపు కారణంగానే మండిపోతున్నాయని చెబుతున్నారు. మొత్తం మీద చమురు సంస్థలు వరసగా ఎనిమిదో సారి ధరలను పెంచడంపై వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.