వేదాంత ధోరణిలో ప్రధాని
భారత ప్రాచీనతకు, సంస్కృతికి కాశీ ప్రతీక అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. కాశీ విశ్వనాధ్ కారిడార్ ను ఆయన ప్రారంభించారు;
భారత ప్రాచీనతకు, సంస్కృతికి కాశీ ప్రతీక అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. కాశీ విశ్వనాధ్ కారిడార్ ను ఆయన వారణాసిలో ప్రారంభించారు. పురాతన కాశీ ఆలయాన్ని పునరుద్ధరించుకున్నామని చెప్పారు. కాశీలో అడుగు పెడితే ప్రత్యేక మైన అనుభూతి కలుగుతుందని మోదీ తెలిపారు. కాశీ విశ్వనాధుడి ఆదేశాల మేరకే నడుచుకుంటున్నానని చెప్పారు. కాశీలో అడుగు పెడితే అన్ని బంధాలకు విముక్తి లభించినట్లవుతుందని మోదీ వేదాంత ధోరణిలో మాట్లాడారు.
కారిడార్ ను....
కాశీ అనే శబ్దంలోనే ప్రత్యేక మైన భక్తిభావం ఉందని మోదీ అన్నారు. కాశీ విశ్వనాధుని ఆలయం, గంగానదిని కలుపుతూ నిర్మించిన కారిడార్ భక్తులకు మరింత అనుకూలంగా ఉంటుందని అన్నారు. మోదీ అంతకు ముందు గంగానదిలో స్నానమాచరించిన అనంతరం కాలభైరవ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాశీ విశ్యనాధుని దర్శించుకున్న అనంతరం పారిశుద్ధ్య కార్మికులను మోదీ సత్కరించారు. ఈ సందర్భంగా వారణాసిలో ఉన్న ప్రజలందరికీ స్వీట్ ప్యాకెట్లను పంపిణీ చేశారు.