నేడు పంజాబ్ లో మోదీ....?
ప్రధాని నరేంద్ర మోదీ నేడు పంజాబ్ లో పర్యటించనున్నారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ఆయన శంకుస్థాపన చేయనున్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ నేడు పంజాబ్ లో పర్యటించనున్నారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ఆయన శంకుస్థాపన చేయనున్నారు. మొత్తం 42,750 కోట్ల విలువైన పనులకు మోదీ శంకుస్థాపన చేస్తారని ప్రధానమంత్రి కార్యాలయం ప్రకటించింది. ఢిల్లీ నుంచి అమృత్ సర్, కత్రా ఎక్స్ ప్రెస్ వే, ఫిరోజర్ పూర్ లో పీజీఐ శాటిలైట్ సెంగర్, హోషియాపూర్ లో రెండు మెడికళాశాలలను మోదీ ప్రారంభించనున్నారు.
తొలిసారి....
అయితే సాగుచట్టాల రద్దు తర్వాత తొలి సారి మోదీ పంజాబ్ లో పర్యటిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేసింది ఎక్కువగా పంజాబ్ రైతులే. పంజాబ్ కు కొద్ది నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఇక్కడ బీజేపీ, అమరీందర్ సింగ్ పార్టీ పొత్తుతో కలసి పోటీ చేస్తున్నాయి. ఎన్నికల నేపథ్యంలోనే మోదీ పంజాబ్ లో పర్యటించనున్నారు.