నేడు కూడా వారణాసిలోనే

ప్రధాని నరేంద్ర మోదీ నేడు వారణాసిలో రెండో రోజు పర్యటించనున్నారు. నిన్న మోదీ కాశివిశ్వనాధ్ కారిడార్ ను ప్రారంభించారు;

Update: 2021-12-14 02:06 GMT

ప్రధాని నరేంద్ర మోదీ నేడు వారణాసిలో రెండో రోజు పర్యటించనున్నారు. నిన్న వారణాసి వెళ్లిన మోదీ కాశివిశ్వనాధ్ కారిడార్ ను ప్రారంభించారు. అక్కగ గంగానదిలో స్నానమాచరించి కాలభైరవుడిని దర్శించుకున్నారు. అనంతరం కాశీవిశ్వేశ్వరుడి ఆలయంలో ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఈ సందర్భంగా మోదీ పారిశుద్ధ్య కార్మికులను స్వయంగా సత్కరించారు. రాత్రికి గంగా హారతిని కూడా మోదీ వీక్షించారు.

సెమినార్ లో....
ఈరోజు కూడా మోదీ వారణాసిలో ఏర్పాటు చేసిన వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. సుపరిపాలన అంశంపై ఏర్పాటు చేసిన సెమినార్ లో ప్రధాని మోదీ పాల్గొననున్నారు. సెమినార్ ముగిసిన తర్వాత వారణాసి నుంచి మోదీ బయలుదేరే అవకాశముంది.


Tags:    

Similar News