మాజీ మంత్రి కోసం వేట.. లుక్ అవుట్ నోటీసులు

తమిళనాడు నేత రాజేంద్ర బాలాజీ కోసం పోలీసులు వెదుకుతున్నారు. ఆయన విదేశాలకు పారిపోకుండా లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు

Update: 2021-12-24 04:22 GMT

తమిళనాడు మాజీ మంత్రి రాజేంద్ర బాలాజీ కోసం పోలీసులు వెదుకుతున్నారు. ఆయన విదేశాలకు పారిపోకుండా లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులను మోసం చేసిన కేసు రాజేంద్ర బాలాజీ పై నమోదయింది. ఆయన కొన్ని కోట్ల రూపాయలు నిరుద్యోగుల నుంచి వసూలు చేశారు. అయితే కేసు నమోదయిన వెంటనే రాజేంద్ర బాలాజీ ఆచూకీ తెలియడం లేదు. ఆయన అజ్ఞాతంలోకి వెళ్లారు.

ముందస్తు బెయిల్ కోసం...
రాజేంద్ర బాలాజీ కోసం పోలీసులు వేట ప్రారంభించారు. విదేశాలకు పారిపోయే అవకాశముందని అనుమానం వచ్చిన పోలీసులు రాజేంద్ర బాలాజీపై లుక్ అవుట్ నోటీసులు ఏర్పాటు చేశారు. అన్ని విమానాశ్రయాల్లో నిఘాను ఏర్పాటు చేశారు. వారం రోజుల నుంచి పోలీసులు ప్రయత్నిస్తున్నా రాజేంద్ర బాలాజీ దొరకడం లేదు. ముందస్తు బెయిల్ కోసం రాజేంద్ర బాలాజీ చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. దీంతో ఆయన అజ్ఞాతంలోకి వెళ్లారు.


Tags:    

Similar News