ప్రధాని పర్యటనను అడ్డుకున్న 150 మందిపై కేసు
ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనను అడ్డుకున్న 150 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనను అడ్డుకున్న 150 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. పంజాబ్ కు వెళ్లిన ప్రధాని మోదీని కొందరు అడ్డుకున్న సంగతి తెలిసిందే. దీంతో ప్రధాని ఇరవై నిమిషాల పాటు వంతెనపైనే ఆగారు. అనంతరం కార్యక్రమాల్లో పాల్గొనకుండా వెనుదిరిగి వచ్చారు. దీంతో ప్రధాని భద్రతా వైఫల్యంపై పెద్దయెత్తున విమర్శలు తలెత్తాయి.
కేంద్రానికి నివేదిక....
సుప్రీంకోర్టులో కూడా దీనిపై విచారణ జరిగింది. అయితే తాజాగా పంజాబ్ ప్రభుత్వం దీనిపై చర్యలు ప్రారంభించింది. ఫరోజ్ పూర్ పోలీసులు 150 మంది పై కేసులు నమోదు చేశారు. అయితే వీరిపై విధించిన సెక్షన్లు 200 రూపాయల జరిమానాతో సరిపెట్టే విధంగా ఉన్నాయి. ఈ మేరకు పంజాబ్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి నివేదిక పంపింది.