రాజకీయ వ్యతిరేకత శతృత్వంగా మారకూడదు
రాజకీయ వ్యతిరేకత శతృత్వంగా మారకూడదని చీఫ్ జస్టిస్ ఎన్.వి. రమణ అన్నారు. ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్నారు
రాజకీయ వ్యతిరేకత శతృత్వంగా మారకూడదని చీఫ్ జస్టిస్ ఎన్.వి. రమణ అన్నారు. ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్నారు. ప్రస్తుతం అలాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. రాజకీయ పక్షాల మధ్య గౌరవం ఉండాలని, కానీ అది నేటికాలంలో అది తగ్గిపోతుందని జస్టిస్ ఎన్.వి.రమణ పేర్కొన్నారు. ప్రభుత్వం, ప్రతిపక్షాల మధ్య గౌరవం లేకుండా పోయిందన్నారు. రాజస్థాన్ అసెంబ్లీ నిర్వహించిన కామన్ వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో సీజేఐ ఈ వ్యాఖ్యలు చేశారు.
పరిశీలన లేకుండానే.....
సరైన పరిశీలనలు, చర్యలు లేకుండానే చట్టాలు ఆమోదం పొందుతున్నాయని జస్టిస్ ఎన్.వి. రమణ తెలిపారు. న్యాయవ్యవస్థలోనూ సమర్థతను పెంచాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. అనేక జైళ్లలో పది లక్షల మంది ఖైదీలు ఉన్నారని, అందులో 80 శాతం మంది కేసుల విచారణను ఎదుర్కొంటున్నారని అన్నారు. క్రిమినల్ జస్టిస సిస్టమ్ లో న్యాయ ప్రక్రియే శిక్షగా మారిపోయిందని జస్టిస్ ఎన్.వి. రమణ అన్నారు. కారణం లేకుండా అరెస్ట్ లు చేయడం, బెయిల్ పొందడం వరకూ ఇబ్బందులు పడుతున్నారని జస్టిస్ ఎన్.వి. రమణ ఆవేదన వ్యక్తం చేశారు.