మణిపూర్ లో పోలింగ్ ప్రారంభం
మణిపూర్ లో తొలి విడత ఎన్నికలకు సంబంధించి పోలింగ్ ప్రారంభమయింది. మణిపూర్ లో రెండు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి.
మణిపూర్ లో తొలి విడత ఎన్నికలకు సంబంధించి పోలింగ్ ప్రారంభమయింది. మణిపూర్ లో రెండు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈరోజు జరిగే ఎన్నికలు ఐదు జిల్లాల పరిధిలోని 38 స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఉదయం నుంచే ఓటర్లు బారులు తీరి పోలింగ్ కేంద్రాల వద్ద నిలుచున్నారు. ఈ 38 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మొత్తం 173 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు.
రెండు విడతలుగా....
తొలివిడత లో జరిగే ఎన్నికల్లో ముఖ్యమంత్రి బీరేన్ సింగ్, ఉపముఖ్యమంత్రి జాయ్ కుమార్ సింగ్ పోటీ పడుతున్నారు. మొత్తం 60 అసెంబ్లీ స్థానాలున్న మణిపూర్ లో రెండు విడతలుగా ఎన్నికలు జరపాలని కేంద్ర ఎన్నికల కమిషన్ నిర్ణయించింది. రెండో విడత పోలింగ్ వచ్చే నెల 5వ తేదీన జరగనుంది. రెండో విడతలో మిగిలిన 22 స్థానాలకు పోలింగ్ ను నిర్వహిస్తారు. మార్చి 10వ తేదీన ఎన్నికల కౌంటింగ్ జరగనుంది.