యూపీలో నేడు చివరి దశ ఎన్నికలు
ఉత్తర్ ప్రదేశ్ లో చివరి దశ ఎన్నికల పోలింగ్ ప్రారంభమయింది. ఈ దశతో ఉత్తర్ ప్రదేశ్ లోని 403 స్థానాలకు ఎన్నికలు పూర్తయినట్లే
ఉత్తర్ ప్రదేశ్ లో చివరి దశ ఎన్నికల పోలింగ్ ప్రారంభమయింది. ఈ దశతో ఉత్తర్ ప్రదేశ్ లోని 403 స్థానాలకు ఎన్నికలు పూర్తయినట్లే. మొత్తం ఏడు దశల్లో యూపీ ఎన్నికల పోలింగ్ ను ఎన్నికల అధికారులు నిర్వహించారు. చివరి దశలో మొత్తం 9 జిల్లాల్లోని 54 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. చివరి దశ ఎన్నికలలో మొత్తం 613 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు.
28 ప్రాంతాలు సున్నితమైన...
ఘాజీపూర్, చందౌలీ, జాన్ పూర్, అజంగఢ్, మీర్జాపూర్, సోన్ భద్ర, భదోహి, ప్రధాని నరేంద్ర మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారాణాసి జిల్లాలు చివరి దశలో ఎన్నిలకు జరుగుతున్నాయి. కొద్ది సేపటి క్రితం పోలింగ్ ప్రారంభమయింది. చివరి దశలో జరుగుతున్న 58 నియోజకవర్గాల్లో 28 నియోజకవర్గాలు సున్నితమైనవిగా అధికారులు గుర్తించారు. ఇక్కడ పటిష్టమైన పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. కోవిడ్ నిబంధనలను పాటిస్తూ పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మహిళల కోసం ప్రత్యేకంగా పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం విశేషం.