త్రిపురలో పోలింగ్ ప్రారంభం

త్రిపుర అసెంబ్లీ ఎన్నికలకు నేడు పోలింగ్ ప్రారంభమయింది. ఇందుకోసం ఎన్నికల కమిషన్ అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది

Update: 2023-02-16 02:45 GMT

త్రిపుర అసెంబ్లీ ఎన్నికలకు నేడు పోలింగ్ ప్రారంభమయింది. ఇందుకోసం ఎన్నికల కమిషన్ అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. మొత్తం 3337 పోలింగ్ కేంద్రాలను ఎన్నికల కమిషన్ ఏర్పాటు చేసింది. పోలింగ్ సందర్భంగా భారీ భద్రతను ఏర్పాటు చేసింది. ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్ర నాలుగు గంటల వరకూ జరుగుతుంది. మొత్తం పోలింగ్ కేంద్రాల్లో 28 కేంద్రాలను అత్యంత సమస్యాత్మకంగా గుర్తించారు.

సమస్యాత్మక ప్రాంతాల్లో...
ఈ ఎన్నికలను బీజేపీ ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందో అదేస్థాయిలో వామపక్షాలు కూడా తీసుకున్నాయి. మార్చి 2న ఎన్నికల లెక్కింపు జరగనున్న ఈ ఎన్నికలకు సంబంధించి 31 వేల మంది సిబ్బందిని నియమించారు. 25 వేల మంది కేంద్ర బలగాలతో భద్రతను కల్పించారు. వీరితో పాటు రాష్ట్ర పోలీసులు కూడా శాంతిభద్రతలను పర్యవేక్షిస్తారు. మొత్తం 28.13 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవాల్సి ఉంది. 259 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.


Tags:    

Similar News