రాష్ట్రపతి భద్రతా సిబ్బందికి కరోనా...14 మందికి?
రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ సెక్యూరిటీ విభాగంలోని 14 మంది సిబ్బందికి కరోనా సోకింది.
రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ సెక్యూరిటీ విభాగంలోని 14 మంది సిబ్బందికి కరోనా సోకింది. దీంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమయింది. ఒకసారి రాష్ట్రపతి సెక్యూరిటీ వింగ్ లోని 14 మందికి కరోనా సోకడంపై ఆందోళన వ్యక్తమవుతుంది. ఇటీవల ఉత్తరాఖండ్ లోని రుషికేశ్ లో రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ గంగా హారతిలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న భద్రతా సిబ్బందితో పాటు ఇతర అధికారులు 19 మందికి కరోనా సోకినట్లు గుర్తించారు.
హోం ఐసొలేషన్ లో....
వీరిందరినీ ప్రస్తుతం వారి రాష్ట్రాల్లో ఐసొలేషన్ లో ఉంచారు. కరో్నా సోకిన వారు రాష్ట్రపతి పాల్గొన్న గంగాహారతి కార్యక్రమంలో విధులు నిర్వహించారు. ఆ కార్యక్రమంలో పాల్గొన్న వారంతా తప్పనిసరిగా కరోనా పరీక్షలు చేయించుకోవాలని అధికారులు కోరారు. ఎక్కువ మంది ఈ కార్యక్రమంలో పాల్గొనడటంతో కరోనా ఎంతమందికి సోకి ఉంటోందనన్న ఆందోళన వ్యక్తమవుతుంది.