వంట నూనె ధరలు తగ్గుతున్నాయ్

కేంద్ర ప్రభుత్వం నూనె గింజలపై దిగుమతి సుంకాన్ని తగ్గించడంతో నూనెల ధరలు మరింత తగ్గే అవకాశముంది

Update: 2021-12-12 03:58 GMT

దేశంలో ప్రజలు నిత్యావసరవస్తువు ధరల పెరుగుదలతో ఆందోళన చెందుతున్నారు. కరోనా విపత్తు నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్న సమయంలో ధరలు ఆకాశాన్నంటుతుండటంతో సామాన్యులు కొనుగోలు చేయలేక అవస్థలు పడుతున్నారు. కూరగాయల ధరలతో పాటు ఉప్పులు, పప్పులు, నూనె, ఉల్లిపాయల వంటి ధరలు కూడా పెరుగుతున్నాయి. అయితే వీటిని నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది.

దిగుమతి సుంకం....
వంట నూనెల ధరలు కిలో 150 వరకూ పలికింది. అయితే కేంద్ర ప్రభుత్వం జోక్యంతో కొంత ఉపశమనం లభించింది. తాజాగా కేంద్ర ప్రభుత్వం నూనె గింజలపై దిగుమతి సుంకాన్ని తగ్గించడంతో నూనెల ధరలు మరింత తగ్గే అవకాశముంది. నూనె గింజలు కూడా కిలోకి మూదు నుంచి నాలుగు రూపాయలు తగ్గే అవకాశముండటంతో రానున్న కాలంలో వీటి ధర మరింత తగ్గుతాయని వ్యాపారులు చెబుతున్నారు.


Tags:    

Similar News