మూడోసారి కూడా మోత మోగించిన మోదీ

వరసగా మూడో ఏడాది కూడా ప్రపంచంలో నెంబర్ వన్ నేతగా మోదీ నిలిచారు

Update: 2022-02-08 07:38 GMT

ప్రధాని నరేంద్ర మోదీ ఇమేజ్ ఏమాత్రం తగ్గడం లేదు. ప్రపంచంలో దిగ్గజ నేతగా ఆయన కొనసాగుతున్నారు. వరసగా మూడో ఏడాది కూడా ప్రపంచంలో నెంబర్ వన్ నేతగా మోదీ నిలిచారు. అమెరికాకు చెందిన మార్నింగ్ కన్సల్ట్ సంస్థ నిర్వహించిన సర్వేలో ప్రపంచంలోనే అత్యంత పాపులారిటీ ఉన్న నేతగా మోదీ మొదటి స్థానంలో నిలిచారు. ఈ సర్వేలో మొత్తం 72 శాతం మంది మోదీ పాపులర్ నేతగా అభిప్రాయపడ్డారు.

ఈ సర్వేలో....
ఈ సర్వేలో మోదీ తర్వాత స్థానంలో మెక్సికో అధ్యక్షుడు ఓబ్రడార్ ఉన్నారు. ఆయనకు 64 శాతం మంది మద్దతిచ్చారు. మూడో స్థానంలో ఇటలీ ప్రధాని మారియో ద్రాగ్చి నిలిచారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆరో స్థానంలో నిలిచారు. బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ పదో స్థానంలో నిలిచారు. మొత్తం మీద మోదీ మూడోసారి కూడా మోదీ అత్యంత పాపులారిటీ ఉన్న నేతగా నిలిచారు.


Tags:    

Similar News