కార్గిల్ లో ప్రధాని మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ దీపావళి వేడుకలు కార్గిల్ లో జరుపుకున్నారు. కార్గిల్ భారత సైనికులతో కలసి ఆయన పండగ చేసుకున్నారు.;

Update: 2022-10-24 06:03 GMT

ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ దీపావళి వేడుకలు కార్గిల్ లో జరుపుకున్నారు. కార్గిల్ భారత సైనికులతో కలసి ఆయన పండగ చేసుకున్నారు. ప్రధాని మోదీ ప్రతి ఏడాది కార్గిల్ లోనే దీపావళి వేడుకలు జరుపుకుంటారు. ఈ ఏడాది కూడా అదే సంప్రదాయాన్ని పాటించారు. సైనికులకు మిఠాయిలు పంచి పెట్టారు. అందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. దేశమంతా దీపావళి పండగను జరుపుకుంటున్నా దేశ సరిహద్దులను కాపాడుతున్న సైనికుల త్యాగాలు అభినందనీయమని ఆయన తెలిపారు.

సరిహద్దులను...
భారత్ ను అన్ని సరిహద్దులను రక్షిస్తూ నిత్యం పోరాడుతున్న జవాన్ల శ్రమ మరువలేనిదని మోదీ తెలిపారు. జవాన్లు కుటుంబాలకు దూరంగా ఉండి మానసికంగా ఇబ్బందులు పడుతూ మరోవైపు దేశాన్ని రక్షిస్తున్నారని అన్నారు. మొక్కవోని దీక్షతో భారత్ ను శత్రుదేశాల నుంచి రక్షిస్తున్న వీర జవాన్లకు తన సెల్యూట్ అని మోదీ అన్నారు. వారి సేవలను కొనియాడుతూ ఆయన ప్రసంగించారు.


Tags:    

Similar News