భారత్ తలచుకుంటే సాధ్యంకానిదేదీ లేదు
ప్రధాని నరేంద్ర మోదీ కేరళలో పర్యటిస్తున్నారు. ఐఎన్ఎస్ విక్రాంత్ ను మోదీ ప్రారంభించారు.;
ప్రధాని నరేంద్ర మోదీ కేరళలో పర్యటిస్తున్నారు. ఆయన ఐఎన్ఎస్ విక్రాంత్ ను జాతికి అంకితం చేశారు. భారత్ అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతుందన్నారు. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఈ నౌకతో భారత్ ప్రపంచ దేశాల సరసన చేరిందని మోదీ ప్రశంసించారు. భారత్ శక్తిమంతమైన దేశంగా తయారయిందనడానికి ఇది ఉదాహరణగా ఆయన పేర్కొన్నారు. భారత్ తలచుకుంటే సాధ్యమేదీ కాదని మరోసారి నిరూపితమయిందన్నారు.
స్వదేశీ సాంకేతికతో...
స్వదేశీ సాంకేతికతో ఈ అత్యాధునిక యుద్ధనౌక ఐఎన్ఎస్ విక్రాంత్ తయారయిందన్నారు. ఈ నౌక ద్వారా 30 యుద్ధ విమానాలను, హెలికాప్టర్లను తీసుకెళ్లే వీలుంది. ఈ నౌకలో 1700 మంది సిబ్బంది ఉంటారు. ప్రపంచ దేశాల సరసన భారత్ చేరడం ఆనందంగా ఉందని మోదీ అన్నారు. దీనిని రూపొందించిన వారిని మోదీ ప్రత్యేకంగా అభినందించారు. దీంతో భద్రత వ్యవస్థ మరింత పటిష్టమవుతుందని మోదీ అభిప్రాయపడ్డారు.