సీబీఐపై ప్రధాని ప్రశంసలు
అవినీతి సాధారణ నేరం కాదని ప్రధాన నరేంద్ర మోదీ అన్నారు.సీబీఐ డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్స్‌లో ప్రసంగించారు.
అవినీతి సాధారణ నేరం కాదని ప్రధాన నరేంద్ర మోదీ అన్నారు. లంచగొండితనం, అవినీతిని నిర్మూలించాలంటే సీబీఐ లాంటి సంస్థల అవసరం ఉందని మోదీ అభిప్రాయపడ్డారు. దేశాభివృద్ధికి ప్రధాన శత్రువు అవినీతి అని ప్రధాని మోదీ అన్నారు. సీబీఐ పరిధి పెరిగిందన్నారు. చాలా నగరాల్లో సీబీఐ కార్యాలయాలను నెలకొల్పుతున్నామని అన్నారు. అవినీతిని కొందరు వారసత్వంగా భావిస్తున్నారన్నారు. సీబీఐ డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్స్‌లో ప్రధాని మోదీ పాల్గొని ప్రసంగించారు.
అవినీతిపై యుద్ధం...
2014 నుంచి తమ ప్రభుత్వం అవినీతిపై యుద్ధం ప్రారంభించిందని మోదీ తెలిపారు. ఈ యుద్ధం కొనసాగుతుందని తెలిపారు. దాదాపు తొమ్మిదేళ్లుగా అవినీతిని నిర్మూలించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. సీబీఐ పనితీరును ప్రధాని నరేంద్ర మోదీ ఈ సందర్భంగా ప్రశంసించారు. ఎలాంటి వత్తిడులకు లేకుండా పనిచేస్తూ సీబీఐకి మరింత పేరు ప్రతిష్టలు తేవాలని నరేంద్ర మోదీ కోరారు. సీబీఐ లాంటి స్వతంత్ర ప్రతిపత్తిగల సంస్థలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని కూడా అన్నారు.