సెంట్రల్ విస్టా అవెన్యూ నేడు ప్రారంభం
ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు సెంట్రల్ విస్టా అవెన్యూ ను ప్రారంభించనున్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు సెంట్రల్ విస్టా అవెన్యూ ను ప్రారంభించనున్నారు. రాష్ట్రపతి భవన్ నుంచి ఇండియా గేట్ వరకూ పునరుద్ధరించిన కర్తవ్యపథ్ మార్గ్, డ్యూటీ పాథ్ లను ఆయన ప్రాంరభించనున్నారు. దీంతో పాటు ఇండియా గేట్ వద్ద ఏర్పాటు చేసిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని కూడా ఆవిష్కరించనున్నారు. రాత్రి 7 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఇండియా గేట్ పరిధిలోని అన్ని మార్గాలను భద్రత దృష్ట్యా మూసివేయనున్నారు. ట్రాఫిక్ ను అనేక మార్గాలకు మళ్లించామని పోలీసులు ప్రకటన విడుదల చేశారు.
ఈ అవెన్యూలో....
మోదీ ప్రారంభించబోయే ఈ అవెన్యూ రాష్ట్రాల వారీగా ఫుడ్‌స్టాల్స్ ను ఏర్పాటు చేసత్ారు. పార్కింగ్ సదుపాయాలతో పాటు, రౌండ్ ది క్లాక్ సెక్యూరిటీ ఇక్కడ ఉంటుంది. దాదాపు ఇరవై నెలల తర్వాత ఇండియా గేట్, రాజ్‌పథ్ లలో సందర్శకులకు అనుమతి ఇవ్వనున్నారు. రాజ్‌పథ్ పునరుద్ధరణతో టూరిస్టులకు అన్ని సౌకర్యాలు కల్పించనున్నారు. రాజ్‌పథ్, సెంట్రల్ విస్టా ప్రాజెక్టులను ఇకపై కర్తవ్యపథ్ గా మారుస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.