మోదీ పంజాబ్ పర్యటన భద్రతపై నేడు తీర్పు
ప్రధాని నరేంద్ర మోదీ పంజాబ్ పర్యటనలో భద్రతాలోపంపై సుప్రీంకోర్టులో నేడు తీర్పు రానుంది.
ప్రధాని నరేంద్ర మోదీ పంజాబ్ పర్యటనలో భద్రతాలోపంపై సుప్రీంకోర్టులో నేడు తీర్పు రానుంది. పంజాబ్ లో ప్రధాని పర్యటన భద్రతాలోపంపై దాఖలయిన పిటీషన్లపై విచారణ పూర్తయింది. నేడు తీర్పు చెప్పనుంది. చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం తీర్పు వెలువరించనుంది.
రిటైర్డ్ జడ్జి చేత...
ఇప్పటికే పంజాబ్ ఘటనపై పంజాబ్ , కేంద్ర ప్రభుత్వాల దర్యాప్తును నిలిపివేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. దీంతో మరో కమిటీ చేత సుప్రీంకోర్టు విచారణకు ఆదేశించే అవకాశముంది. రిటైర్డ్ జడ్జి చేత విచారణ జరపుతామని ఇప్పటికే స్పష్టం చేైసింది. భద్రత వైఫ్యలానికి కారకులను ఈ కమిటీ గుర్తించనుంది.