Loksabha Elections : నేడు ఆరోదశ పోలింగ్ ప్రారంభం.. ప్రస్తుతానికి ప్రశాంతంగానే
లోక్ సభ ఎన్నికల ప్రక్రియ ముగింపు దశకు చేరుకుంది. నేడు ఆరోదశ ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ ప్రారంభయింది
లోక్ సభ ఎన్నికల ప్రక్రియ ముగింపు దశకు చేరుకుంది. నేడు ఆరోదశ ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ ప్రారంభయింది. ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంట వరకూ పోలింగ్ జరగనుంది. ఈరోజు ఎనిమిది రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 58 పార్లమెంటు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.
58 స్థానాలకు...
బీహార్ లో ఎనిమిది, హర్యానాలో పది, జమ్ము కాశ్మీర్ లో ఒకటి, జార్ఖండ్ లో నాలుగు, ఢిల్లీలో ఏడు, ఒడిశాలో ఆరు, ఉత్తర్ ప్రదేశ్ లో పథ్నాలుగు, పశ్చిమ బెంగాల్ లో ఎనిమిది స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఈ నెల 4వ తేదీన ఫలితాలు వెలువడనున్నాయి. అయితే నేడు ఆరోదశ పోలింగ్ కు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేశారు. అధికారులు భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. సమస్యాత్మక ప్రాంతాల్లో కేంద్ర బలగాలు మొహరించాయి.