తమిళనాడులో ఈడీ సోదాల కలకలం

తమిళనాడులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారుల సోదాలు నిర్వహిస్తున్నారు.;

Update: 2025-01-03 06:06 GMT

తమిళనాడులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారుల సోదాలు నిర్వహిస్తున్నారు. డీఎంకే ప్రజాప్రతినిధుల ఇళ్లు, కార్యాలయాల్లో ఈ తనిఖీలను చేస్తున్నారు. ఉదయం నుంచి తమిళనాడులోని పలు చోట్ల ఈడీ సోదాలు జరుగుతున్నాయి. అందిన సమాచారం మేరకు ఆర్ధిక లావాదేవీల విషయంలో జరిగిన అవకతవకలపై ఈ దాడులు జరుగుతున్నట్లు తెలిసింది.

డీఎంకే నేతల ఇళ్లలో...
తమిళనాడులోని తిరువన్నామలై, గాంధీనగర్, కోయంబత్తూరు, చెన్నై నగరాల్లో ఈడీ అధికారుల సోదాలు నిర్వహిస్తున్నారు. అనేక చోట్ల బృందాలుగా విడిపోయి ఈ దాడులు చేశారు. ఫెమా నిబంధనలు ఉల్లంఘించడమే కాకుండా విదేశాలకు నగదును పంపారన్న ఆరోపణలపై ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలిసింది. డీఎంకే కు చెందిన దురై మురుగన్ ఇళ్లలో కూడా సోదాలు నిర్వహిస్తున్నారు.

ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App Now


Tags:    

Similar News