మా సీఎం అభ్యర్థి ఆయనే
పంజాబ్ ఆమ్ ఆద్మీ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా భగవంత్ మాన్ ను ఆ పార్టీ అధినేత కేజ్రీవాల్ ప్రకటించారు
పంజాబ్ ఆమ్ ఆద్మీ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా భగవంత్ మాన్ ను ఆ పార్టీ అధినేత కేజ్రీవాల్ ప్రకటించారు. భగవంత్ మాన్ ప్రస్తుతం సంగ్రూర్ నియోజకవర్గం లోక్ సభ పార్లమెంటు సభ్యుడిగా ఉన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి గా అరవింద్ కేజ్రీవాల్ ఎవరు ఉండాలన్న దానిపై ప్రజాభిప్రాయాన్ని కోరారు. ప్రజాభిప్రాయంలో భగవంత్ సింగ్ మాన్ కు దాదాపు 93.3 శాతం మద్దతు లభించింది.
మున్సిపల్ ఎన్నికల్లో....
పంజాబ్ ఎన్నికల్లో తొలి ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించిన పార్టీ ఆమ్ ఆద్మీ. ఇటీవల ఛండీగడ్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ విజయం సాధించడంతో ఆ పార్టీ ప్రచారంలోనూ, అభ్యర్థుల ఎంపికలోనూ, ముఖ్యమంత్రి అభ్యర్థి నిర్ణయంలోనూ ముందంజలో ఉంది. అన్ని రకాల హామీలు ఇస్తూ పోటీలో ఆమ్ ఆద్మీ పార్టీ ముందు వరసలో ఉన్నారు.