హైకమాండ్ పై సిద్ధూ హాట్ కామెంట్స్

పంజాబ్ పీసీసీ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ మరోసారి కాంగ్రెస్ హైకమాండ్ పై హాట్ కామెంట్స్ చేశారు

Update: 2022-02-04 08:44 GMT

పంజాబ్ పీసీసీ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ మరోసారి కాంగ్రెస్ హైకమాండ్ పై హాట్ కామెంట్స్ చేశారు. బలహీనమైన నేతలనే ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉండాలని పార్టీ పెద్దలు కోరుకుంటారని నవజ్యోత్ సింగ్ సిద్దూ అభిప్రాయపడ్డారు. వారి ట్యూన్స్ కు డ్యాన్స్ చేసే వారినే ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకుంటారని సిద్దూ వ్యాఖ్యానించడం పార్టీలో చర్చనీయాంశమైంది.

ఎన్నికలు.....
ప్రస్తుత ముఖ్యమంత్రి చరణ్ జిత్ సింగ్ చన్నీయే కొనసాగుతారన్న ప్రచారం నేపథ్యంలో సిద్ధూ వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. పంజాబ్ ఎన్నికలు మరికొద్ది రోజుల్లో జరుగుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో వర్గవిభేదాలకు సిద్ధూ కామెంట్స్ మరింత ఆజ్యం పోశాయంటున్నారు.


Tags:    

Similar News