సింపుల్ గా పెళ్లి చేసేసుకున్న ముఖ్యమంత్రి

గురుప్రీత్ కౌర్ వయసు 32 ఏళ్లు. కౌర్ కుటుంబం కురుక్షేత్రలోని పెహ్వా ప్రాంతానికి చెందినది

Update: 2022-07-07 11:10 GMT

పంజాబ్ సీఎం భగవంత్ మాన్ రెండో పెళ్లి చేసుకున్నారు. హర్యానాకు చెందిన 32 ఏళ్ల గుర్ ప్రీత్ కౌర్ తో ఆయన వివాహం నేడు జరిగింది. ఈ పెళ్లికి చండీగఢ్ లోని భగవంత్ మాన్ నివాసం వేదికగా నిలిచింది. కొద్దిమంది కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో వీరి వివాహం సిక్కు సంప్రదాయాల ప్రకారం జరిగింది. ఈ పెళ్లికి ఆప్ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కుటుంబ సమేతంగా హాజరయ్యారు. ఆప్ ఎంపీ రాఘవ్ చద్ధా కూడా హాజరయ్యారు. భగవంత్ మాన్ వయసు 48 ఏళ్లు కాగా, ఆయన కంటే గుర్ ప్రీత్ 16 ఏళ్లు చిన్నది. 2015లో భగవంత్ మాన్ మొదటి భార్య ఇందర్ ప్రీత్ కౌర్ కు విడాకులు ఇచ్చారు. వీరికి ఇద్దరు సంతానం ఉన్నారు. ఇందర్ ప్రీత్ కౌర్ తన పిల్లలు సీరత్ కౌర్ మాన్ (21), దిల్షాన్ మాన్ (17)లతో కలిసి అమెరికాలో ఉంటున్నారు. ఇక డాక్టర్ గుర్ ప్రీత్ తో మొహాలీలో ఆమె వైద్యురాలిగా సేవలు అందిస్తున్నారు.

సీఎం భగవంత్‌ మాన్‌ సింగ్‌కు ఇంతకు ముందు ఇందర్‌ప్రీత్ కౌర్‌తో పెళ్లయింది. 2014లో ఆయన ఎంపీగా పోటీ చేసినప్పుడు ఎన్నికల ప్రచారంలో కూడా ఆమె పాల్గొన్నారు. అయితే ఆరేళ్ల వివాహ బంధం తర్వాత మొదటి భార్య ఇందర్‌పీత్ర్‌ కౌర్‌, ఆయన విడిపోయారు. భగవంత్‌ మాన్‌కు తొలి భార్య ద్వారా ఇద్దరు పిల్లలు ఉన్నారు. వారు ప్రస్తుతం అమెరికాలో ఉంటున్నారు. ఆయన మరో పెళ్లి చేసుకోవాలని తల్లి, సోదరి సూచించారు. మళ్లీ పెళ్లి చేసుకోవాలని తల్లి, చెల్లెలు కోరడం వల్లే భగవంత్ మాన్ రెండో పెళ్లికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. తల్లి, చెల్లెలే ఈ సంబంధం తీసుకొచ్చినట్లు సమాచారం. వారిద్దరికి తెలిసిన వైద్యురాలు గురుప్రీత్‌ కౌర్‌ను ఎంపిక చేశారు. గురువారం చండీగఢ్‌లోని భగవంత్‌ మాన్‌ సింగ్‌ నివాసంలో గురుప్రీత్‌ కౌర్‌తో ఆయన రెండో పెళ్లి అత్యంత సన్నిహితుల సమక్షంలో ప్రైవేటుగా జరగబోతోంది.
గురుప్రీత్ కౌర్ వయసు 32 ఏళ్లు. కౌర్ కుటుంబం కురుక్షేత్రలోని పెహ్వా ప్రాంతానికి చెందినది. ఆమె తండ్రి ఇందర్‌జిత్ సింగ్ రైతు. ఆమె తల్లి మాతా రాజ్ కౌర్ గృహిణి. విదేశాల్లో ఉంటున్న ఆమెకు ఇద్దరు సోదరీమణులు ఉన్నారు. మాన్‌కు వారి కుటుంబాలతో సంవత్సరాలుగా అనుబంధం కలిగి ఉన్నాయని చెప్పారు. ఆమె మేనమామ, గురీందర్ జీత్ మాట్లాడుతూ.. గురుప్రీత్ ఎప్పుడూ చదువులో ముందుండేది. ఆమె ముల్లానా మెడికల్ కాలేజీలో చదువుకుంది, ఆమె బంగారు పతక విజేత అని ఆమె మామ చెప్పారు. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి కౌర్ కూడా భగవంత్ మాన్‌కు సహాయం చేసిందని పలువురు తెలిపారు


Tags:    

Similar News