థార్ మీద అలాంటి చేష్టలు.. తిక్క కుదిర్చిన పోలీసులు

కదులుతున్న ఎస్‌యూవీ కారు బానెట్‌పై కూర్చొని వీడియోలు తీస్తూ సోషల్ మీడియాలో;

Update: 2023-08-06 05:05 GMT

కదులుతున్న ఎస్‌యూవీ కారు బానెట్‌పై కూర్చొని వీడియోలు తీస్తూ సోషల్ మీడియాలో పోస్టు చేసిన వారికి పోలీసులు మంచి బుద్ధి చెప్పారు. ఆమె అలా బానెట్ మీద కూర్చుని ఉండగా.. మరో వ్యక్తి వీడియో తీశాడు. సదరు 25 ఏళ్ల మహిళకు పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. కారు జలంధర్-జమ్మూ జాతీయ రహదారిపై దాసుయా సమీపంలో ఉన్న సమయంలో మహిళ దాని బానెట్‌పై కూర్చుని ఉండగా వీడియో షూట్ చేశారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, పోలీసులు రిజిస్ట్రేషన్ నంబర్ ద్వారా ఎస్‌యూవీ యజమానిని గుర్తించి, మోటారు వాహనాల చట్టం కింద కారును స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయాన్ని దసూయా స్టేషన్ హౌస్ ఆఫీసర్ బల్వీందర్ సింగ్ ధృవీకరించారు.

ఈ ఘటనకు పాల్పడ్డ మహిళకు పోలీసులు వార్నింగ్ ఇచ్చారు. ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేసి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని హితవు పలికారు. హైవే మీద వెళ్లే సమయంలో చిన్న తప్పు జరిగినా తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదని పోలీసులు హెచ్చరించారు. మహిళను, SUV లోని ఇతర ప్రయాణికులకు పోలీసులు హెచ్చరిక జారీ చేశారు. గతంలో ఇలాంటి స్టంట్స్ చేసి ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. సోషల్ మీడియాలో వీడియోలు పెట్టి లైక్స్ సంపాదించాలనే ఉద్దేశ్యంతో ఇలాంటి పనులు చేస్తూ వస్తుంటారు కొందరు.


Tags:    

Similar News