Puri Ratna Bhandar: 46 సంవత్సరాల తర్వాత తెరుచుకున్న పూరీ రత్న భండార్
ఒడిశాలోని పూరీలో ఉన్న 12వ శతాబ్దపు జగన్నాథ ఆలయ ఖజానా..
ఒడిశాలోని పూరీలో ఉన్న 12వ శతాబ్దపు జగన్నాథ ఆలయ ఖజానా.. రత్న భండార్ 46 సంవత్సరాల తర్వాత ఆదివారం మధ్యాహ్నం తిరిగి తెరుచుకుంది. ఒడిశా ప్రభుత్వం ఏర్పాటు చేసిన 11 మంది సభ్యుల కమిటీ సభ్యులు ఆదివారం మధ్యాహ్నం జగన్నాథ ఆలయంలోని ఖజానాను తిరిగి తెరవడానికి ప్రవేశించారు. ట్రెజరీలోకి ప్రవేశించిన వారిలో ఒరిస్సా హైకోర్టు మాజీ న్యాయమూర్తి బిశ్వనాథ్ రాత్, శ్రీ జగన్నాథ ఆలయ పరిపాలన (SJTA) చీఫ్ అడ్మినిస్ట్రేటర్ అరబింద పాధీ, ASI సూపరింటెండెంట్ DB గడానాయక్, పూరీ రాజు 'గజపతి మహారాజా' ప్రతినిధి ఉన్నారు. రత్న భాండార్‌లోకి ప్రవేశించిన వ్యక్తులలో నలుగురు ఆలయ సేవకులు పట్జోషి మోహపాత్ర, భండార్ మెకప్, చధౌకరణ, డ్యూలికరణ్ కూడా ఉన్నారు.
జస్టిస్ బిశ్వనాథ్ రథ్ నేతృత్వంలోని 16 మంది సభ్యుల కమిటీ ఈ రత్న భాండాగారంలోని సంపదను లెక్కించనుంది. పూరీ ఆలయంలో జగన్నాథుడి సేవలకు అంతరాయం కలుగకుండా, ఈ రహస్య గదిని తెరిచారు. చివరిసారిగా 1978లో ఈ రత్న భాండాగారాన్ని తెరిచారు. అప్పట్లో 70 రోజుల పాటు అందులోని సంపదను లెక్కించారు. కమిటీ సభ్యులు ఖజానా లోపలికి వెళ్లడంతో పాములు పట్టే రెండు బృందాలు కూడా ఆలయం వద్ద ఉన్నాయి. ఖజానాలో పాములు ఉన్నట్లు గుర్తించారు. రత్న భండార్‌లోని విలువైన వస్తువుల బరువు, తయారీ వంటి వివరాలతో కూడిన డిజిటల్ కేటలాగ్‌ను సిద్ధం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.