88 శాతం బ్యాంకుల గూటికి రూ.2 వేల నోట్లు

మేలో అధిక విలువ కలిగిన కరెన్సీ నోట్లను చలామణి నుంచి ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించిన తర్వాత రూ.3.14 లక్షల కోట్ల విలువైన

Update: 2023-08-01 12:07 GMT

మేలో అధిక విలువ కలిగిన కరెన్సీ నోట్లను చలామణి నుంచి ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించిన తర్వాత రూ.3.14 లక్షల కోట్ల విలువైన రూ.2,000 నోట్లలో 88 శాతం తిరిగి బ్యాంకింగ్ వ్యవస్థలోకి వచ్చాయని రిజర్వ్ బ్యాంక్ మంగళవారం తెలిపింది. బ్యాంకుల నుండి అందిన సమాచారం ప్రకారం.. జూలై 31, 2023 వరకు చెలామణి ఉపసంహరణ తర్వాత తిరిగి పొందిన రూ. 2,000 నోట్ల మొత్తం విలువ రూ. 3.14 లక్షల కోట్లు అని ఆర్‌బిఐ తెలిపింది. "తత్ఫలితంగా జూలై 31 న బిజినెస్‌ ముగిసే సమయానికి చెలామణిలో ఉన్న రూ. 2,000 నోట్లు రూ. 0.42 లక్షల కోట్లుగా ఉన్నాయి" అని సెంట్రల్ బ్యాంక్ తెలిపింది. మే 19, 2023 నాటికి చెలామణిలో ఉన్న రూ. 2,000 నోట్లలో 88 శాతం తిరిగి వచ్చాయి. మార్చి 31, 2023న రూ. 3.62 లక్షల కోట్లకు చేరిన మొత్తం రూ.2,000 నోట్ల విలువ మే 19, 2023న బిజినెస్‌ సమయానికి రూ.3.56 లక్షల కోట్లకు తగ్గింది.

రూ. 2,000 డినామినేషన్‌లో ఉన్న మొత్తం నోట్లలో 87 శాతం డిపాజిట్ల రూపంలో వచ్చాయి. మిగిలిన 13 శాతం ఇతర డినామినేషన్ నోట్లలోకి మార్చబడ్డాయి. సెప్టెంబరు 30, 2023కి ముందు తమ వద్ద ఉన్న రూ. 2,000 నోట్లను డిపాజిట్ చేయడానికి లేదా మార్చుకోవడానికి రాబోయే రెండు నెలల సమయాన్ని ఉపయోగించుకోవాలని రిజర్వ్ బ్యాంక్ ప్రజలను కోరింది. రూ. 2 వేల నోట్లను ఉపసంహరించుకున్నట్లు ఆర్‌బీఐ మే 19న సాయంత్రం ఒక ప్రకటన చేసింది. అదే రోజు రాత్రి తన అధికారిక వెబ్‌సైట్‌లో దీనిపై ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. 'రూ. 2 వేల నోటును ఉపసంహరించాం. కానీ అవి చట్టబద్ధంగా చెల్లుబాటు అవుతాయి.' అని చెప్పింది. సెప్టెంబర్ 30 లోగా నోట్ల మార్పిడి చేసుకోవడం, డిపాజిట్ చేయడం వంటివి చేయాలని సూచించింది. 

Tags:    

Similar News