India Corona: భారత్ లో కరోనా కేసులు ఎన్నంటే?

భారత్ లో రికవరీ రేటు 98.71 శాతంగా నమోదయింది. అయితే యాక్టివ్ కేసుల శాతం 0.10శాతంగా ఉందని అధికారులు తెలిపారు.

Update: 2022-09-24 04:37 GMT

భారత్ లో కరోనా కేసులు తగ్గడం లేదు. ప్రతి రోజూ ఐదు వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. ఒక్కరోజులోనూ 5,383 మంది కరోనా వైరస్ బారిన పడ్డారు. కరోనా కారణంగా 20 మంది చనిపోయారని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. మరణాల సంఖ్య కూడా తగ్గకపోవడం ఆందోళన కల్గిస్తుంది. భారత్ లో రికవరీ రేటు 98.71 శాతంగా నమోదయింది. అయితే యాక్టివ్ కేసుల శాతం 0.10శాతంగా ఉందని అధికారులు తెలిపారు.

యాక్టివ్ కేసుల సంఖ్య....
దేశంలో ఇప్పటి వరకూ 4,45,58,425 మంది కరోనా వైరస్ బారిన పడ్డారు. వీరిలో 4,39,84,695 మంది కరోనా నుంచి కోలుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. భారత్ లో ఇప్పటి వరకూ కోవిడ్ కారణంగా 5,28,449 మంది మరణించారని అధికారులు తెలిపారు. ప్రస్తుతం 45,281 యాక్టివ్ కేసులున్నాయి. దేశంలో ఇప్పటి వరకూ 217.26 కోట్ల మేర కరోనా వ్యాక్సిన్ డోసులు వేసినట్లు అధికారులు తెలిపారు.


Tags:    

Similar News