తగ్గుతున్న యాక్టివ్ కేసులు
దేశంలో కరోనా వైరస్ రికవరీ రేటు 98.71 శాతంగా నమోదయింది. ఇక యాక్టివ్ కేసుల శాతం 0.10 శాతంగా నమోదయింది.
భారత్ లో కరోనా వైరస్ కేసులు స్వల్పంగా తగ్గాయి. ఒక్కరోజులో 5,747 మంది కరోనా బారిన పడ్డారు. 29 మంది కరోనా కారణంగా మరణించారు. ఒక్కరోజులోనే 5,618 మంది చికిత్స పొంది కరోనా నుంచి కోలుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్ రికవరీ రేటు 98.71 శాతంగా నమోదయింది. ఇక యాక్టివ్ కేసుల శాతం 0.10 శాతంగా నమోదయింది.
వ్యాక్సినేషన్....
భారత్ లో ఇప్పటి వరకూ 4,45,28,524 కరోనా వైరస్ బారిన పడ్డారు. చికిత్స పొంది దేశంలో ఇప్పటి వరకూ కరోనా నుంచి 4,39,53,374 కోలుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. ఇప్పటి వరకూ దేశంలో 5,28,302 మంది మరణించారు. ప్రస్తుతం దేశంలో 46,848 యాక్బివ్ కేసులు ఉన్నాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. కరోనా వ్యాక్సిన్ డోసుల సంఖ్య 216.41 కోట్లకు చేరుకుంది.