సంచలన ప్రకటన చేసిన ఆర్బీఐ.. భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు
ద్రవ్యోల్బణం 17 ఏళ్ల గరిష్ఠ స్థాయికి చేరుకోవడంతో ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదని శక్తికాంతాదాస్ వెల్లడించారు. ఆర్బీఐ సంచలన..
న్యూఢిల్లీ : కొద్దిరోజులుగా రష్యా- ఉక్రెయిన్ కు మధ్య యుద్ధం జరుగుతోన్న విషయం తెలిసిందే. ఆ యుద్ధ ప్రభావం భారత్ ఆర్థిక వ్యవస్థ పై పడింది. దాంతో ఆర్బీఐ సంచలన ప్రకటన చేసింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చేసిన ప్రకటనతో స్టాక్ మార్కెట్లు పతనమయ్యాయి. వడ్డీ రేట్లను 40 బేసిస్ పాయింట్లకు పెంచుతున్నట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతా దాస్ ప్రకటించారు. రెండేళ్ల తర్వాత ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకుంది.
ద్రవ్యోల్బణం 17 ఏళ్ల గరిష్ఠ స్థాయికి చేరుకోవడంతో ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదని శక్తికాంతాదాస్ వెల్లడించారు. ఆర్బీఐ సంచలన నిర్ణయంతో రెపోరేటు 4.40 శాతం పెరిగింది. ఆర్బీఐ ప్రకటనతో.. నిఫ్టీ 300 పాయింట్లు, సెన్సెక్స్ 1000 పాయింట్లు నష్టపోయాయి. ఆర్బీఐ వడ్డీరేట్ల పెంపుతో.. లోన్ వినియోగదారులు షాకయ్యారు. ఈ నిర్ణయంతో ఇకపై హౌస్, పర్సనల్, వెహికల్ లోన్లు తీసుకునే వారు భారీ వడ్డీ చెల్లించక తప్పని పరిస్థితి నెలకొంది.